ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించాం: సీఎం
TG: కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, వాకిటి శ్రీహరి, సీతక్క హాజరయ్యారు. ఆడబిడ్డలకు చీర, సారె పెట్టడం తెలంగాణ సంప్రదాయమని సీఎం రేవంత్ అన్నారు. ఈ సందర్భంగా కోటిమంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు వెల్లడించారు.