శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు..
NRML: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నిర్మల్ పట్టణంలోని వాల్మీకి నగర్ శ్రీ రామాలయంలో ఈరోజు మధ్యాహ్నం శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన పిదప సాయంత్రం శ్రీ సీతారాముల పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శ్రీ సీతారాములను పలు కాలనీలో ఊరేగించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వామివారి పల్లకి యాత్రలో పాల్గొన్నారు.