'ఈనెల 12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి’
SRD: కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రహమాన్ కోరారు. సంగారెడ్డిలో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ చట్టాలతో కార్మికుల హక్కులను కాల రాసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.