నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
HYD: నగరంలో ఇవాళ హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ నుంచి తాడ్‌బంద్ వరకు 12 కి.మీ. మేర యాత్ర సాగుతుంది. పుత్లీబౌలి, కోఠి, RTC క్రాస్ రోడ్, చిక్కడపల్లి, అశోక్ నగర్, గాంధీనగర్, కవాడిగూడ, సికింద్రాబాద్ పరిసరాల్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.