శిథిలావస్థలో పాఠశాల.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

శిథిలావస్థలో పాఠశాల.. విద్యార్థుల భద్రతపై ఆందోళన

SRD: సదాశివపేట మండలం నాగులపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలోకి చేరి విద్యార్థులకు ప్రమాదకరంగా మారింది. మంగళవారం కురిసిన వర్షానికి అదనపు తరగతి గదుల పెచ్చులు ఊడి, మూత్రశాలలు కూలిపోయాయి. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కొత్త గదులు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.