మహానందీశ్వరుని దర్శించుకున్న జిల్లా కలెక్టర్

NDL: మహానందీశ్వరుని సన్నిధిలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దంపతులు సోమవారం పూజలు నిర్వహించారు. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చిన కలెక్టర్ రాజకుమారి దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరీ దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.