బజాజ్ చేతక్ బండికి 126 చలాన్లు

బజాజ్ చేతక్ బండికి 126 చలాన్లు

KNR: సీటీలో ఓ బజాజ్ చేతక్ పై ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 126 చలాన్లు జనరేట్ అయ్యాయి. బజాజ్ చేతక్ పై 2019 మే నుంచి 2022 అక్టోబర్ వరకు వేసిన చలాన్లన్నీ లెక్కిస్తే ఫైన్ల అమౌంట్ రూ. 28,875కు చేరింది. ప్రస్తుతం ఈ చేతక్ బండి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పాత చేతక్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కితే ఓనర్ దానిని వాళ్లకే ఇచ్చేసి వెళ్తాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.