వైసీపీలో చేరిన బీజేపీ నాయకులు

వైసీపీలో చేరిన బీజేపీ నాయకులు

కర్నూలు జిల్లా: నందవరం మండలం నాగలదిన్నే గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు శనివారం ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నాయకులు మాల రుద్రయ్య, జీవరత్నం, ఆంజి, రంజిత్ తో పాటు దాదాపు 100 మంది వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ నాయకులు రాజా శరత్, తిమ్మప్ప, ప్రభాకర్, అతావుల్లా, తదితరులు పాల్గొన్నారు.