దేవరకద్రలో బీజేపీ సమీక్షా సమావేశాలు
MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో బీజేపీ నాయకులతో ఈ నెల 2న సమీక్షా సమావేశాలు జరుగనున్నాయని పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. మూసాపేట్, భూత్పూర్, అడ్డాకల్ మండలాల బీజేపీ నాయకులతో సమావేశాలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటలకు పోతులమడుగు, 11 గంటలకు జానంపేట, మధ్యాహ్నం 2 గంటలకు కందూరులో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.