రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
ELR: ఉంగుటూరు - ప్రకాశరావుపాలెం R&B రహదారిలోని నీలాద్రిపురం సమీపంలో సోమవారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని శ్రీకాకుళానికి చెందిన శంకర్ గాయపడ్డారు. బాధితుడు తారు పవర్ ప్లాంటులో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. స్థానికులు బాధితుడిని ఉంగుటూరు 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.