బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కలెక్టర్

GDWL: మల్దకల్ మండలం ప్రభుత్వ పాఠశాలలో శనివారం జిల్లా కలెక్టర్ బడిబాట కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, వచ్చే సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం కూడా అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.