'ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి'

'ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి'

MNCL: వేసవిలో ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జన్నారం ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ అన్నారు. శనివారం జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే ప్రజలకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.