ఆ హిట్ సినిమాకు సీక్వెల్?

మాస్ మహారాజా రవితేజతో దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్' మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చేసేందుకు గోపీచంద్ ఆసక్తిగా ఉన్నాడట. ఈ విషయాన్ని ఆయనే చెప్పాడు. దీంతో ఇందుకోసం దర్శకుడు ఎలాంటి కథను సిద్ధం చేశాడో చూడాలి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.