'భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు వేగవంతం'

'భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు వేగవంతం'

VSP: AU ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో నిర్ణీత సమయం కంటే ముందుగానే పనులు పూర్తి చేయాలని సూచించారు. డీసీపీ మణికంఠ, జీవీఎంసీ అధికారి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.