రాజన్న ఆలయంలో మహాలింగార్చన

SRCL: శ్రావణమాసం చివరి సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహా లింగార్చన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో జరిగిన మహాలింగార్చన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా జ్యోతులను లింగాకారంలో వెలిగించి పూజలు చేశారు.