'అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు'

RR: దేశానికి ఉపయోగపడే చట్టాలు చేయాల్సిన పార్లమెంట్ చట్టపరమైన విధానాలను తప్పించుకునే దిశగా బిల్లులు తీసుకొస్తుందని కాంగ్రెస్ నాయకుడు రఘు అన్నారు. ఈరోజు షాద్‌నగర్‌లో మాట్లాడుతూ.. గతంలో సుప్రీంకోర్టు కేంద్ర మంత్రి అమిత్ షాను గుజరాత్ నుంచి బహిష్కరించిందని గుర్తుచేశారు. ఇలాంటి వ్యక్తి నేడు చట్టసభల్లో చట్టాలను చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడన్నారు.