కలెక్టరేట్ బీసీవై అధ్యక్షుడు నిరాహార దీక్ష
ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు నరాల శ్రీనివాస్ యాదవ్ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలని, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని సమగ్ర కుల గణన చేపట్టాలని పలు డిమాండ్లతో నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు.