చెరువులు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు: కలెక్టర్

VZM: బొబ్బిలి పట్టణంలో ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో గురువారం నిర్వహించిన స్వర్ణాంద్ర 2047 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులను కాపాడటం పై దృష్టి సారించాలని అదికారులకు సూచించారు. గ్రామాలలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలని చెరువులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.