VIDEO: టీచర్‌పై విద్యార్థి పిడిగుద్దులు
AP: ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి జడ్పీ హైస్కూల్‌లో పదోతరగతి విద్యార్థులు రెచ్చిపోయారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిపైనే పిడిగుద్దులతో దాడికి దిగారు. పరీక్షలు రాయాల్సిన విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తించారు. గతంలో టీచర్స్ అంటే భయభక్తులు ఉండేవని, ఇప్పుడు విద్యార్థుల దాడులతో టీచర్లే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.