శిక్షణా తరగతులను సందర్శించిన కలెక్టర్
KMR: దోమకొండ రైతువేదికలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. ఎన్నికల విధులు నిబద్ధత, పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ పరిశీలన, ఓటర్ల క్యూలైన్ల నిర్వహణ, శాంతి భద్రతలను పటిష్టం చేయాలని సూచించారు.