ఉదయాన్నే ఆలయానికి పోటెత్తిన భక్తులు
ATP: కార్తీక మాసం సందర్భంగా తాడిపత్రిలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. నాలుగో సోమవారం కావడంతో పెన్నా నది ఒడ్డున వెలసిన బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని దీపాలు వెలగించారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.