VIDEO: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద హైడ్రా కమిషనర్ పర్యటన

HYD: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పరిసరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. భారీ వర్షం కారణంగా రహదారిపై వరద నీరు నిలిచిందని స్థానిక అధికారులు కమిషనర్‌కు వివరించారు. పైపులైన్లలో పూడిక పేరుకుపోయి, మూసుకుపోవడంతో సమస్య తీవ్రమైందన్నారు. వెంటనే పైపు లైన్‌లలో పూడికను తొలగించాలని కమిషనర్ అధికారులకు సూచించారు.