మైనర్లు డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు

మైనర్లు డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో ఎస్.కోట పట్టణ సీఐ వి.నారాయణమూర్తి మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. మైనర్ డ్రైవింగ్, శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కొరడా ఝులిపించారు. ఈ మేరకు మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలపై వివరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.