మన్మధ్ లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మత్తులకు నిధులు మంజూరు: ఎమ్మెల్యే

NRML: లోకేశ్వరం మండలంలోని మన్మద్ లిఫ్ట్ ఇరిగేషన్ కోటి 61 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వెల్లడించారు. వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. మరమ్మత్తులు పూర్తయితే రైతంగానికి సాగు నీరు అందుతుందన్నారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి సంబంధిత శాఖ మంత్రికి ధన్యవాదములు తెలిపారు.