రూ.151 కోట్ల నగదు, నగలు స్వాధీనం

రూ.151 కోట్ల నగదు, నగలు స్వాధీనం

తమిళనాడులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నిన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో రూ.151 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులు పట్టుబడ్డాయని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ ప్రకారం రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లాలంటే రశీదులు, ఆధార పత్రాలు ఉండాలని ఆమె తెలిపారు.