‘లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు’
బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్జేడీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం 'జీవికా దీదీల' (స్వయం సహాయక బృందాల మహిళలు) ఖాతాల్లో జమ చేసిన సొమ్మును ఆర్జేడీ దోచుకోవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. 'మీరు (ఆర్జేడీ) ప్రయత్నించినా, లాలూ ప్రసాద్ యాదవ్ తాతలు దిగొచ్చినా కూడా ఆ సొమ్మును దోచుకోలేరు' అని అమిత్ షా హెచ్చరించారు.