పాఠశాలలో ముగ్గుల పోటీలు

పాఠశాలలో ముగ్గుల పోటీలు

MDK: వట్ పల్లి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. రేపటి నుంచి 17 వరకు పాఠశాలకు సెలవులు ఉన్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు వివిధ రకాల ముగ్గులను వేసి చూపరులను ఆకర్షింప చేశారు. ఈ ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు హెచ్ఎం రంజిత్ కుమార్ బహుమతులు అందజేశారు.