విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

ATP: ఉరవకొండ మండలం లత్తవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు. అనంతరం భోజనం నాణ్యతను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.