వీరబల్లి మండల కేంద్రంలో ఓటరు దినోత్సవం

వీరబల్లి మండల కేంద్రంలో ఓటరు దినోత్సవం

అన్నమయ్య: వీరబల్లి మండల కేంద్రంలో ఓటర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. MRO నేతృత్వంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. 70 ఏళ్లు నిండిన సీనియర్ ఓటర్లను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. అధికారులు ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.