విద్యుత్ సమస్యలపై రైతులకు ఏఈ అవగాహన
JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ రైతులతో “పొలం బాట” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ రైతులతో మాట్లాడి విద్యుత్ సరఫరా, ట్రాన్స్ ఫార్మర్ సమస్యలు, వైర్ల మరమ్మతులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యుత్ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్యలు ఎదురైన వెంటనే తమ కార్యాలయాన్ని సందర్శించాలని కోరారు.