ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
WGL: నర్సంపేట పట్టణంలోని జిల్లా స్థాయి ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ సత్య శారద ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, శుభ్రత, రోగుల సౌకర్యాలు, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రిలో శుభ్రతను ఖచ్చితంగా పాటించాలన్నారు. రోగులకు సమయానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనీ సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.