కేంద్ర కేబినెట్ కీలక భేటీ

కేంద్ర కేబినెట్ కీలక భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్(CCS) భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది తొలి సీసీఎస్ సమావేశం. పాక్‌పై దాడికి సంబంధించిన వివరాలను అధికారులు ప్రధానికి వివరించారు. అనంతరం దాడిపై పాకిస్తాన్ స్పందన, ప్రపంచ దేశాల రియాక్షన్‌పై చర్చిస్తున్నారు. ఈరోజు జరిగిన దాడులపై పాక్ తీసుకోబోయే నిర్ణయాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు.