విషాదం.. ఘర్షణలో యువకుడి మృతి

PLD: ఎడ్లపాడు మండలం బోయపాలెంలో జరిగిన ఘర్షణలో సంగం గోపాలపురానికి చెందిన వెల్పూరి శ్రీనాధ్ (25) మృతి చెందాడు. ఆదివారం రాత్రి మద్యం సేవిస్తుండగా, భార్య, సోదరి, కుమారుడు పోట్లూరి విష్ణుతో మాటమాట పెరిగింది. ఈ గొడవలో మల్లవరపు చందు, రావురి విజయ్ కూడా కలసి శ్రీనాధ్‌ను కొట్టారు. ఛాతీలో నొప్పితో ఆసుపత్రికి తరలించగా, మృతి చెందాడు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.