జాతీయస్థాయి పోటీలకు తిరుపతి అమ్మాయి ఎంపిక
TPT: నరసరావుపేటలో 19వ రాష్ట్రస్థాయి అండర్-17 ఫ్లోర్ బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా బాలికల జట్టు మొదటి స్థానం సాధించింది. దీంతో తిరుపతికి చెందిన నందిని రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. అయితే జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు ఢిల్లీలో నిర్వహించే జాతీయ స్థాయి ఫ్లోర్ బాల్ పోటీలలో ఈమె పాల్గొననుంది.