అక్షర చిట్ ఫండ్ కార్యాలయం ముందు పోలీస్ బందోబస్తు
హన్మకొండ నగరంలోని బాలసముద్రంలోని అక్షర చిట్ ఫండ్ ప్రధాన కార్యాలయం ఎదుట బుధవారం పోలీసులు భారీగా మోహరించారు. బాధితులు ముట్టడి చేసే అవకాశం ఉన్నట్లు ముందస్తు సమాచారం అందడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు సుబేదారి పోలీసులు హన్మకొండ ఏసీపీ సారథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.