సౌదీలో ముస్లింగా.. ఇండియాలో హిందువుగా
TPT: తిరుపతికి చెందిన యాలమూరి శ్రీనివాస్ రెడ్డి, పుష్ప అనే దంపతులు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడ ముస్లిం మతాన్ని స్వీకరించారు. ఈ క్రమంలో పేర్లు కూడా మార్చుకున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ అబ్దుల్లా, అమ్మిన్నా దంపతులు వేద మంత్రోచ్ఛరణల మధ్య మళ్లీ హిందూ మతంలోకి చేరారు.