నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల సందడి
SDPT: జిల్లాలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నాచగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో క్షేత్రాన్ని భక్తులు అధికంగా సందర్శించారు. ఆలయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్‌లో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో ఏర్పాట్లు చేశారు.