ఇంటర్ ఫిజిక్స్ పేపర్-2లో తప్పిదం
TG: ఇంటర్ వార్షిక పరీక్షల్లో భాగంగా నిన్న సెకండియర్ ఫిజిక్స్ పేపర్-2లో తప్పిదం జరిగింది. ఇంగ్లిష్ మీడియం వారికి ఒకలా.. తెలుగు మీడియం వారికి మరోలా ప్రశ్నలు ఇచ్చారు. ప్రశ్నపత్రంలోని 21వ ప్రశ్నలో ఈ పొరపాటు చోటుచేసుకుంది. తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో 8 మార్కుల ప్రశ్నతోపాటు, 2 మార్కుల ప్రశ్నను కలిపి అడిగారు. ఇంగ్లిష్ మీడియంలో 8 మార్కుల ప్రశ్న మాత్రమే ఇచ్చారు.