'నేడే చివరి తేదీ.. దరఖాస్తు చేసుకోండి'

GDWL: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యూజీ, పీజీలో అడ్మిషన్లకు ఇవాళ చివరి తేదీ అని ఉమ్మడి పాలమూరు జిల్లా ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ తెలిపారు. రెగ్యూలర్‌గా కాలేజీకి వెళ్లి చదవలేని విద్యార్థులు, ఉద్యోగులకు ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశం అని సూచించారు. పూర్తి వివరాలకు https://braou.ac.in వెబ్ సైట్ సందర్శించాలన్నారు.