కేజీబీవీని పాఠశాలను సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌వో
KMR: బీర్కూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌వో డా. విద్య శనివారం సందర్శించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పారిశుద్ధ్య పరిస్థితులను ఆమె పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.