పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

KMR: సదాశివనగర్ మండలంలోని తిర్మానపల్లి, కల్వరాల్, పద్మజీవాడి, మోడేగావ్, ధర్మరావుపేట, అమర్లబండ గ్రామాలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.