ముగిసిన 'లోకహిత విజ్ఞానం' వేడుకలు
SKLM: జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్లలోని ట్రిపుల్ ఐటీలో 'లోక హిత విజ్ఞానం' పేరుతో నిర్వహించిన వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను చాటుకున్నారు. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, నూతన ఆవిష్కరణ ల దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా పలువురు వక్తలు పిలుపునిచ్చారు.