తాగునీటి సమస్యకు పరిష్కారం
NGKL: వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చేసేందుకు వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ చర్యలు చేపట్టారు. ఇవాళ గ్రామంలో కొత్త బోరు మోటార్ ఏర్పాటు చేయించారు. సమస్యను పరిష్కరించిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.