చదల గ్రామంలో రూ.1.96,116 పలికిన లడ్డూ
CTR: పుంగనూరు మండలం దిగువచదల్ల గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవం జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి గణేష్ మండపం వద్ద లడ్డూ వేలం వేశారు. కృష్ణారెడ్డి రూ.1,96,116 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. తనకు లడ్డూ దక్కడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.