నేటి నుంచి శానిటేషన్ డ్రైవ్

HYD: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నేటి నుంచి ఈనెల 25 వరకు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు GHMC కమిషనర్ కర్ణన్ తెలిపారు. వర్షాకాలంలో వ్యాపించే మలేరియా, డెంగీ వంటి వ్యాధులను నివారించడానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామన్నారు.