రకుల్ మూవీ రెండు రోజుల కలెక్షన్స్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'దే దే ప్యార్ దే 2' మూవీ ఈ నెల 14న విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.9.45 కోట్లు రాబట్టగా.. రెండో రోజు రూ. 13.77 కోట్లు సాధించింది. ఓవరాల్‌గా రెండు రోజుల్లో మొత్తం రూ.23.22 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ మూవీని దర్శకుడు అన్షుల్ శర్మ తెరకెక్కించాడు.