రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

GDWL: రాజోలి నివాసి తెలుగు శేఖర్ కర్నూలు జిల్లా సింగవరం గ్రామ సమీపంలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పని నిమిత్తం రాజోలి నుంచి కర్నూలుకు బైక్‌పై వెళ్తుండగా సింగవరం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన శేఖర్‌ను స్థానికులు వెంటనే స్పందించి కర్నూలు GGHకు తరలించారు. పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.