BRS సోషల్ మీడియా సభ్యుడుని పరామర్శించిన మాజీ మంత్రి
JNG: పాలకుర్తి మండల కేంద్రంలోని తొర్రూర్ గ్రామానికి చెందిన BRS పార్టీ సోషల్ మీడియా, గ్రామ వార్డు సభ్యుడు బక్క నగేష్ యాదవ్‌కి ఇటీవల యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతం అతడు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ వారి నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.