ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు
VZM: చీపురుపల్లి మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల మహిళా ఉపాధ్యాయులను, సిబ్బందిని సన్మానించి వారి సేవలను కొనియాడారు. అనంతరం హెచ్ఎం ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని తెలిపారు. విద్యార్థుల్లో లింగ విపక్ష ఉండకూడదని విద్యార్థులకు తెలిపారు.