పదోన్నతి పొందిన అధికారికి సన్మానం
PDPL: సుల్తానాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది, ముత్తారానికి బదిలీ అయిన ఎండీ. సాదిక్ పాషాను ఎంపీడీవో దివ్యదర్శన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు. ఎంపీవో, ఏఈ పీఆర్, వివిధ విభాగాల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.